గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌జెండర్లకు పారిశుద్ధ్య కార్మికులుగా ఉద్యోగాలు కల్పించారు. 20 మంది ట్రాన్స్‌జెండర్లకు ఈ మేరకు నియామకపత్రాలు అందించారు. పొరుగు సేవల వ్యవస్థ ద్వారా వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ నిర్ణయంపై ట్రాన్స్‌జెండర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.