బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో మరింత బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలను తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. పంటకోతలు, వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.