Andhra pradesh Weather Update: ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. అయితే ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. మంగళవారం నాటికి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.