ఏపీలో కూటమి పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఇటీవల కాశీనాయన క్షేత్రంకు సంబంధించిన కూల్చివేతల గురించి జగన్ ఈ పోస్టు పెట్టారు. వైసీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్న ఆయన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఎక్స్‌లో రాసుకొచ్చారు.దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.