YS Jagan Simhachalam: మృతుల కుటుంబాలకు కోటి ఇవ్వాలి.. లేదంటే నేనొచ్చాక గుర్తుపెట్టుకుని ఇస్తా

4 hours ago 3
విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానం వద్ద గోడ కూలిన ఘటనలో మృతుల కుటుంబాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటనలో మధురవాడలోని చంద్రవరానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సింహాచలం ప్రమాద ఘటన దురదృష్టకరమన్న వైఎస్ జగన్.. అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని విమర్శించారు. ఆరు రోజుల కిందటే గోడ నిర్మాణం చేపట్టారన్న వైఎస్ జగన్.. రెండు రోజుల కిందట పని పూర్తి చేశారని అన్నారు. సింహాచలంలో చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో తెలియదా.. చందనోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలన్న వైఎస్ జగన్.. ప్రభుత్వం ఇవ్వకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందిస్తామన్నారు.
Read Entire Article