YS Jagan: చంద్రబాబు, బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

1 year ago 29
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసం ఎలాంటి గడ్డైనా తింటారని.. ఎంత క్రూర రాజకీయాలు అయినా చేస్తారంటూ మండిపడ్డారు. ఇలాంటోళ్లు భూమ్మీద చాలా అరుదుగా పుడతారన్న జగన్.. కర్మ కొద్దీ ఏపీలో పుట్టారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో తన చెల్లి, తల్లితో పాటుగా తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని.. ఇలాంటి వ్యక్తి మానవతా విలువ గురించి మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. తల్లిదండ్రులు చనిపోతే కనీసం తలకొరివి అయినా పెట్టని వ్యక్తి చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article