YS Sharmila: నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు.. దేవుడు, నాన్న చూస్తున్నారు.. ఏడ్చేసిన షర్మిల

3 months ago 4
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎమోషనల్ అయ్యారు. విలేకర్ల సమావేశంలోనే కన్నీరు పెట్టుకున్నారు. వైఎస్ షర్మిలకు, వైఎస్ జగన్‌కు మధ్య ఆస్తి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై శుక్రవారం వైసీపీ నేతలు పేర్ని నాని, వైవీ సుబ్బారెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తీరుపై విమర్శలు చేశారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయించాలన్న టీడీపీ, చంద్రబాబు కుట్రలో షర్మిల పావుగా మారారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ ఆస్తులు అన్నీ ఆయన స్వార్జితమని.. అందులో షర్మిలకు హక్కు లేదని పేర్ని నాని, వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన షర్మిల.. ఈ క్రమంలోనే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
Read Entire Article