రేషన్ బియ్యం అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటైంది. దీనిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటును స్వాగతించారు. అయితే సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై గతంలో టీడీపీ ఉద్యమాలు చేసిందన్న షర్మిల.. నిజమైన ఉద్యమాలే అయితే ఒప్పందంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.