YSRCP: ఏపీపై మొంథా తుపాను ఎఫెక్ట్.. మనసు మార్చుకున్న వైసీపీ..

7 months ago 28
మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఉన్న తీవ్రవాయుగుండం.. మంగళవారం ఉదయానికి తుపానుగా బలపడనుంది. అనంతరం తీవ్ర తుపానుగా మారి మంగళవారం సాయంత్రం తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ 28న తలపెట్టిన నిరసన ర్యాలీలను నవంబర్ 4కు వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించింది. వైసీపీ శ్రేణులు తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read Entire Article