వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీకానున్నారు. ఈ సమావేశం తర్వాత జనసేనలో ఎప్పుడు చేరతారనే విషయమై ఓ క్లారిటీ రానుంది. మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత బాలినేని తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు. అలాగే వైసీపీలో కోటరీ నడుస్తోందని.. తాను పార్టీలో ఉండటం కూడా వారికి ఇష్టం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.