YSRCP ర్యాలీలో కుప్పకూలిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. హెల్త్ అప్డేట్ ఇదే!

9 months ago 35
Botsa Satyanarayana Ill Fall Down: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవ నిరసన కార్యక్రమంలో అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే పార్టీ కార్యకర్తలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎండ వేడిమి కారణంగానే ఆయన కుప్పకూలిపోయారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. అంతకుముందు ఆయన సుమారు కిలోమీటరున్నర మేర ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన సభలో ఈ ఘటన జరిగింది.
Read Entire Article