YSRCP: వైఎస్ జగన్‌కు రిలీఫ్.. సీబీఐ పిటిషన్ కొట్టేసిన కోర్టు

7 months ago 32
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వైఎస్ జగన్ లండన్ పర్యటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. తన పెద్ద కూతురిని చూసేందుకు వైఎస్ జగన్ అక్టోబర్ 11వ తేదీ లండన్ వెళ్లారు. అయితే వైఎస్ జగన్ లండన్ పర్యటనలో బెయిల్ షరతులను ఉల్లంఘించారని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లండన్ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ తన సొంత నంబర్ కాకుండా.. వేరే ఫోన్ నంబర్ ఇచ్చారని.. ఆ నంబర్‌కు ఫోన్ చేసినా పనిచేయలేదని పిటిషన్‌లో పేర్కొంది. వైఎస్ జగన్ ఉద్దేశపూర్వకంగా పనిచేయని ఫోన్ నంబర్ ఇచ్చారంటూ సీబీఐ పిటిషన్ వేయగా.. ఈ పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది.
Read Entire Article