తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాల్లో జొన్నతో చేసిన రొట్టెలు, ఇతర పోషకాహారం అందించనున్నారు. కర్ణాటకలోని విజయవంతమైన మోడల్‌ను అనుసరించి.. తెలంగాణలోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మహిళా సంఘాలతో వీటిని తయారు చేయించి, ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ పథకం జొన్న సాగును ప్రోత్సహించి, రైతులకూ లబ్ధి చేకూర్చనుంది.