Andhra Pradesh Anganwadis Meet Minister On Salaries Hike Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలతో చర్చలు జరిపింది. మంత్రి సంధ్యారాణితో సమావేశం అయ్యారు.. ప్రధానంగా జీతాలు పెంపుపై అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలని కోరుతోంది. ఇప్పటికే 10 డిమాండ్లలో 9 నెరవేర్చామని మంత్రి సంధ్యారాణి అంటున్నారు. అంగన్‌వాడీలు మాత్రం ఉగాదిలోపు జీతాల పెంపుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.