సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్‌లో ప్రమాదం జరిగింది. పిల్లలంతా ఉన్న సమయంలోనే.. ఒక్కసారిగా పైకప్పు పెచ్చులూడి కిందపడింది. ఈ ఘటనలో ఐదుగురు పిల్లలకు గాయాలయ్యాయి. గాయపడిన పిల్లలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ క్రాంతి, స్థానిక ఎమ్మెల్యే సంజీవ రెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించారు.