ఏపీలోని పలు మినీ అంగన్వాడీ సెంటర్లను గతేడాది కూటమి ప్రభుత్వం అప్- గ్రేడ్ చేసింది. వీటిని మెయిన్ సెంటర్లుగా మార్చింది. ఇందులో పనిచేసే ఆయాలనే కార్యకర్తలుగా నియమించింది. దీంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ మొత్తం 5 వేల హెల్పర్ పోస్ట్‌లు భర్తీ చేయనున్నట్టు తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించారు. అయితే, వీటిని రెండు దశల్లో భర్తీ చేస్తామని.. మొదట 2,645 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.