Telangana Praja Palana Dinotsavam: సెప్టెంబర్ 17 తేదీ తెలంగాణ ప్రజలకు ప్రత్యేకం. అయితే.. ఈ తేదీ ఈసారి హైదరాబాద్‌వాసులకు మరింత ప్రత్యేకంగా మారింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ఓవైపు మహాగణపతి నిమజ్జన కార్యక్రమం జరగనుండగా.. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. దీంతో.. తెలంగాణ ప్రజలందరి చూపు సెప్టెంబర్ 17న హైదరాబాద్ వైపే ఉండనుంది.