హైడ్రా తన కొత్త అధికారిక వెబ్‌సైట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హైడ్రా సేవలు, అత్యవసర సహాయం, వాతావరణ సమాచారం, వర్షపాతం, వరద ప్రభావిత ప్రాంతాలు, చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూములు, విపత్తు నిర్వహణ వివరాలను ఇందులో తెలుసుకోవచ్చు. 24 గంటల హెల్ప్‌లైన్ 1070ను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. ఫైర్ ఎన్‌వోసీకి ఆన్‌లైన్ దరఖాస్తు సదుపాయం కల్పించారు. భూ భారతి, హెచ్‌ఎండీఏ లేక్స్ పోర్టళ్లకు నేరుగా వెళ్లే అవకాశం ఉంది. హైడ్రా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణ కార్యక్రమాల వివరాలు కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.