తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హౌసింగ్ అడ్వాన్స్ రుణాలపై ఆర్థిక శాఖ కీలక ఆంక్షలు విధించింది. హెచ్‌ఎండీఏ, హౌసింగ్ బోర్డు లేదా సహకార సొసైటీలలో ఇళ్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి అడ్వాన్స్ రుణాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గానూ వివిధ కేటగిరీల కింద నిధులను విడుదల చేస్తూనే.. రికవరీ, మంజూరు ప్రక్రియపై కఠిన నిబంధనలను విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.