TTD Complaint To Police On Devotees Reels In Front Of Srivari Temple: తిరుమలలో కొంతమంది భక్తులు టీటీడీ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్, వీడియోలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. తాాజాగా కొందరు భక్తులు ఆలయం ముందు రీల్స్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన టీటీడీ రీల్స్ చేసిన భక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.