హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 9.15 గంటల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పేలుడు జరిగిందా.. భూకంపం వచ్చిందా..? అని చర్చించుకున్నారు. ఆయా ప్రాంతాల్లో భవన నిర్మాణాల కోసం బండరాళ్లను తొలగించేందుకు అనధికారికంగా బ్లాస్టింగ్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. భారీ శబ్దానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.