ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల లబ్ధిదారులకు రుణాలు.. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు..!

2 hours ago 1
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల నిర్మాణాలను ఏడాదిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఫ్లాట్‌కు రూ.11 లక్షలు కాగా.. ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోంది. మిగతా రూ. 6 లక్షలు లబ్ధిదారుడు నాలుగు విడతల్లో చెల్లించాలి. ఒకేసారి మొత్తం చెల్లించలేని పేదలకు బ్యాంకు రుణాలు అందించే అంశంపై హౌసింగ్‌ బోర్డు అధికారులు వివిధ బ్యాంకులతో చర్చిస్తున్నారు. ఆదాయ ధ్రువీకరణ, రుణ పరిమితి, వడ్డీ రేట్లు, కిస్తీల చెల్లింపు నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా నియోజకవర్గాల్లోనే ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Read Entire Article