అక్రమ సంబంధంపై అనుచిత వ్యాఖ్యలు.. యూట్యూబ్ వీడియోలు చూసి వ్యక్తి దారుణ హత్య

2 months ago 11
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్‌లో జరిగిన మొగిలి అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. తనతో సన్నిహితంగా ఉండే వివాహితను, తనను సమాజంలో కించపరుస్తూ మాట్లాడుతున్నాడనే కక్షతో గంగరాపు మహేష్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఇందుకోసం యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు, ఆయుధాల తయారీని శోధించిన మహేష్.. ఈనెల 28న అర్ధరాత్రి మొగిలిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రాడ్డు, బైక్, మొబైల్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article