అఖండ-2 టికెట్ రేట్ల పెంపు విషయంలో 'బుక్‌మైషో'పై హైకోర్టు సీరియస్.. పొరపాటు జరిగిందన్న మంత్రి

2 months ago 3
బాలకృష్ణ 'అఖండ 2' టికెట్ ధరల పెంపు విషయంలో బుక్‌మైషోపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరల పెంపు విషయంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. బుక్‌మైషో పెంచిన ధరలకే టికెట్లు విక్రయించిందని అందులో పేర్కొన్నారు. దీన్ని విచారించిన కోర్టు.. బుక్‌మైషోను ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంది. మరోవైపు, భవిష్యత్తులో ఏ సినిమాకు టికెట్ ధరలు పెంచేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అఖండ్ 2 విషయంలో పొరపాటు జరిగిందన్నారు.
Read Entire Article