ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో డైరెక్టర్ బోయపాటి శ్రీను సందడి చేశారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న ‘అఖండ 2’ సినిమా షూటింగ్ లోకేషన్ చూసేందుకు వచ్చారు. కృష్ణానదిలో పడవపై తిరుగుతూ లోకేషన్ సెర్చ్ చేశారు.. గుడిమెట్ల చారిత్రాత్మకత కలిగిన గ్రామం కావడంతో పరిశీలించారు. గుడిమెట్ల నుంచి వేదాద్రి వరకు కృష్ణా నదిపై పడవ ప్రయాణం చేసి లోకేషన్స్ చూశారు. త్వరలో గుడిమెట్లలో ‘అఖండ 2’ ఘాటింగ్ జరిగే అవకాశం ఉందంటున్నారు.