అజారుద్దీన్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. పేరు తొలగింపుపై HCAకు కీలక ఆదేశాలు

3 hours ago 1
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నార్త్ స్టాండ్ పేరు తొలగించవద్దని హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ స్టే ఇచ్చింది. రెండు దశాబ్ధాల పాటు టీమిండియాకు సేవలందించానని, పదేళ్లు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించానని అజారుద్దీన్ తన వాదనను వినిపిస్తున్నారు. పేరు తొలగింపు అనేది మాజీ క్రికెటర్ ప్రతిష్టకు భంగంకలిగించడమే కాకుండా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించేలా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
Read Entire Article