కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా అడ్డం వస్తే అడ్డంగా నరుకుతం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా హెచ్చరికలు చేయడంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.. ఎమ్మెల్యే వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు.