ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మేనియా కనిపిస్తోంది. నాలుగేళ్ల కిందట తగ్గేదేలే అంటూ ‘పుష్ప’తో రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. తెలుగు సినీ చరిత్రలో మొదటిసారి జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా అరుదైన ఘనత సాధించారు. అవార్డులతో పాటు రివార్డుల్లోనూ తగ్గేదేలే అని నిరూపించిన అల్లు అర్జున్.. ఇప్పుడు ‘పుష్ప2’తో మరోసారి దానికి మించిన మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే, ఈ సినిమాపై రాజకీయ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.