దావోస్ పర్యటనకు పయనమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో స్థిరపడిన తెలుగువారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా ఉన్న సమయంలో తాను చేసిన ఆవిష్కరణల గురించి వివరించారు. ఇందులో భాగంగానే.. బిల్‌గేట్స్‌తో మీటింగ్, మెక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టడం గురించి చెప్పుకొచ్చారు. హైటెక్ సిటీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చంద్రబాబు.