Kommareddy Pattabhiram On Local Body Elections: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరగనీయకుండా వైఎస్సార్సీపీ అడ్డుకుంటోందన్నారు టీడీపీనేత, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి. స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.12,500 కోట్లు శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. వైఎస్సార్సీపీ నిత్యం అరాచకాలు, దాడులు, రక్తపాతానికి తెగబడుతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను కూడా తీసుకొచ్చారని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.