దీక్షా దివాస్లో భాగంగా.. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో తన జైలు జీవితం అనేది చిన్న పాజ్ మాత్రమేనని.. కవిత అభిప్రాయపడ్డారు. తమది ఉద్యమ నేపథ్య కుటుంబమని, రాజకీయ నేపథ్య కుటుంబమని తెలిపిన కవిత.. ప్రజల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. లగచర్ల భూ సేకరణ రద్దు అనేది.. బీఆర్ఎస్ పార్టీ విజయమేనని కవిత చెప్పుకొచ్చారు.