ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేస్తూ దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరడంతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. తాజాగా ఆయన సుప్రీంకోర్టుకు ఎక్కడంతో.. అసలు ధర్మాసనం ఎస్‌ఎల్‌పీని విచారణకు స్వీకరిస్తుందా, లేదా అనేది కీలకంగా మారింది.