తెలంగాణలో అనలాగ్, నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిర్ణయం ప్రకారం కృత్రిమ పన్నీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 కింద ఆదేశాలు జారీ చేశారు. తక్కువ ధర, ఎక్కువ నిల్వ సామర్థ్యం కారణంగా కొన్ని వాణిజ్య సంస్థల్లో వినియోగించే అనలాగ్ పన్నీర్‌ను అసలైన పాల పన్నీర్‌గా విక్రయించకుండా చర్యలు తీసుకోవడమే ఈ నిర్ణయం లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.