తెలంగాణలో పామాయిల్ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. పామాయిల్ గెలల ధరను దాదాపు మూడు వేలు పెంచుతూ రూ.17,043గా నిర్ణయించింది. ఈ పెంపుతో అన్నదాతకు దసరా పండుగ ముందే వచ్చిందని మంత్రి తుమ్మల అన్నారు. పామాయిల్ సాగును లాభసాటి చేసి అన్నదాతలను ప్రోత్సహించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.