తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది సిగ్గుచేటు, హాస్యాస్పదమని అన్నారు. రేవంత్ రెడ్డి తన పేరును రాజీవ్ లేక జవహార్ అని మార్చుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. మరోవైపు, జీహెచ్‌ఎంసీ ఎదుట బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. పాత పేరు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కూడా ఈ చర్యను పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణించింది.