రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ.12 వేలతో చేతులు దులుపుకుంటున్నారని ఫైరయ్యారు. ధోకాలకు కేరాఫ్‌గా కాంగ్రెస్ సర్కార్ మారిపోయిందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.