కేంద్రం తెచ్చిన అపార్ కార్డు నమోదులో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అపార్ కార్డు నమోదు కోసం ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నారు. అయితే నమోదు సమయంలో ఆధార్ కార్డులో వివరాలు, అడ్మి్షన్ రిజిస్టర్, యూడైస్‌లో వివరాలతో పోలిస్తే తప్పుగా ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఆధార్ కార్డులో పుట్టినరోజు, తండ్రి పేరు వంటి వివరాలు మార్చాల్సి వస్తే.. బర్త్ సర్టిఫికేట్ కావాల్సి వస్తోంది. దీంతో బర్త్ సర్టిఫికేట్ లేని గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.