హైదరాబాద్ అంబర్ పేట ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన సంఘటన చూస్తే.. ఎంత బరితెగించార్రా.. మరీ ఇంతకు దిగజారాలా అనిపిస్తోంది. అపార్ట్‌మెంట్‌లో పొద్దుపొద్దున్నే.. లిఫ్ట్ దగ్గరే, డోర్ పక్కనే.. కనీసం ఎవరైనా వస్తారూ.. చూస్తారు అన్న భయం లేకుండా.. సీసీ కెమెరాలు ఉన్నాయన్న ధ్యాస కూడా లేకుండా.. దొంగతనం చేశాడు ఓ దొంగ. అది కూడా చెప్పులు, షూస్. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.