అప్పు ఇవ్వడం వల్ల ప్రాణం పోతుంది అంటే.. పాపం ఈ పెద్దావిడ ఇలా చేసేది కాదేమో..

1 month ago 5
నల్గొండ జిల్లా హాలియాలో అప్పు అడిగినందుకు ఓ వృద్ధురాలిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. రెడ్డి కాలనీకి చెందిన సుంకిరెడ్డి అనసూయమ్మ (65) తాను అప్పుగా ఇచ్చిన డబ్బుల కోసం ధనలక్ష్మి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లగా.. అక్కడ నిర్వాహకుడు రాములు, అతని భార్య, కుమారుడు కలిసి ఆమెపై దాడి చేశారు. ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు కోసం కత్తిపీటతో గొంతు కోసి చంపి, మృతదేహాన్ని హోటల్ ఆవరణలోనే పూడ్చిపెట్టారు. నిందితులు రెండు రోజుల పాటు ఏమీ ఎరుగనట్లు అక్కడే తిరిగారు. పోలీసుల విచారణలో సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ దారుణం వెలుగుచూసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article