సరూర్‌నగర్‌లో సంచలనం స్పష్టించిన అప్సర హత్యకేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు వెల్లడించింది. దీనిలో నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది. అంతే కాకుండా.. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు అదనంగా శిక్షను విధించింది. అంతే కాకుండా.. అప్సర కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.