హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నగరానికి చేరుకున్న బీదర్ దొంగల్ని ఓ ఆటో డ్రైవర్ సికింద్రాబాద్‌లో డ్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతాల్లో డబ్బులున్న బ్యాగుల్ని మార్చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.