అభివృద్ధిలో భాగం కావాలి.. మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

10 months ago 19
పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా పోలీసుల సేవలను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అమరవీరులకు నివాళులర్పించి.. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు సమర్థంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు కీలక సూచనలు చేశారు. సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
Read Entire Article