ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. ఎన్‌సీసీ లిమిటెడ్, షాపూర్ జీ పల్లోంజి లిమిటెడ్, లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్ సంస్థలు.. వీటికి సంబంధించిన టెండర్లను దక్కించుకున్నాయి. ఎల్1 బిడ్డర్లకు పనులు అప్పగించేలా సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్మాణ పనులకు సర్వం సిద్ధం అయింది.