వెంకటపాలెం టోల్ ప్లాజా కారణంగా తమ ఊరిలోకి తాము వెళ్లాలన్నా కూడా టోల్ ఫీజు చెల్లంచాల్సి వస్తోందని వెంకటపాలెం గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల ప్రజలకు లోకల్ పాసులు ఇవ్వాలంటూ వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద ఉన్న నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఊరిలోకి వెళ్లే మార్గాన్ని తెరవాలని కోరారు. ఈ వినతులపై స్పందించిన ఎన్‌హెచ్ఏఐ అధికారులు.. వెంకటపాలెం గ్రామానికి వెళ్లే మార్గాన్ని తెరిచినట్లు తెలిపారు. లోకల్ పాసుల జారీపై ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావిస్తామని తెలిపారు.