ఏపీ మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్‌లు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి మీదుగా చెన్నైకు ఓ కారిడార్, అలాగే, చెన్నై నుంచి చిత్తూరు మీదుగా బెంగళూరుకు మరో కారిడార్, హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరుకు ఇంకో కారిడార్ నిర్మాణం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతికి సమీపంగానే బుల్లెట్ రైలు స్టేషన్ ఉండేటా డీపీఆర్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.