ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పలు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిధుల వినియోగంపై కేబినెట్ సైతం ఆమోద ముద్ర వేసింది. తాజాగా అమరావతికి మరో గుడ్ న్యూస్ అందింది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హడ్కో.. అమరావతికి రూ.11000 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించినట్లు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు.