ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గురువారం రోజున కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అయితే అమరావతిలో జరిగే ఈ ప్రారంభోత్సవాలలో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవచ్చని సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారాయణ, బుధవారం రోజు కలిశారు. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అయితే విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకకు హాజరుకావాల్సి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు డిప్యూటీ సీఎంవో వెల్లడించింది.