తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ మరో సరికొత్త కార్యక్రమం చేపడుతోంది. ఏపీ ప్రభుత్వ ప్రణాళిక విభాగం సహకారంతో శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో రెండో విడత ట్రైనింగ్ పూర్తైంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగు రాష్ట్రాలకు చెందిన 1888 మంది శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లుగా శిక్షణ తీసుకున్నారు.