Ameenpur Student Murder Case Update: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ప్రేమించిన బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయిని దారుణంగా హత్య చేశారు. నిందితురాలి కుమార్తె శ్రవణ్‌నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో.. పథకం ప్రకారం బాధితుడిని ఇంటికి రప్పించి.. బ్యాటుతో దారుణంగా కొట్టి ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ గొడవల నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్న నిందితురాలు, సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.