సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన 6 అంతస్తుల అక్రమ భవనాన్ని హైడ్రా అధికారులు విజయవంతంగా కూల్చివేశారు. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లకు నష్టం కలగకుండా పక్కా ప్రణాళికతో ఈ తొలగింపు చేపట్టారు. అమీన్‌పూర్‌లోని 861 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసే పనులు కూడా వేగవంతమయ్యాయి. కబ్జాదారుల నుంచి భూములను కాపాడటంతో స్థానికులు హైడ్రాకు మద్దతు తెలపడమే కాకుండా, పలుచోట్ల సంబరాలు చేసుకున్నారు.